Raajadi Rajanu Lyrics

Writer :

Singer :




రాజాధిరాజానూ నేనురా ఇక వైజాగూ వైభోగం చూడరా
సరదాల సామ్రాట్టు నేనురా ఇక సర్కారూ సీడెడ్డు నావిరా
జాక్ పాటే నేను కొట్టెస్తా జయహూరే నేను పట్టేస్తా
టాటాతో మాట కలిపేస్తా బిర్లా కే బీటు వేసేస్తా
అరె రాజాధిరాజానూ నేనురా ఇక వైజాగూ వైభోగం చూడరా
సరదాల సామ్రాట్టు నేనురా ఇక సర్కారూ సీడెడ్డు నావిరా

వెండిరేకూ వెడ్డింగు కార్డూ చెల్లి పెళ్ళికి వేస్తానురా
గోల్డు వాక్కూ పందిళ్ళు వేస్తే రాజభవనే విడిదిల్లురా
పాటియలా రాజువస్తే భలా ఫ్లాటినాల పంచెలిస్తా
పాదరసం కాళ్ళు కడిగీ పెళ్ళుపెళ్ళుమంటు పెళ్ళి చేస్తా
రాజమాతకంటా రత్నాల చినుకులంటా
మా చెల్లి పెళ్ళి కట్నం నా స్విస్సు బ్యాంకు ఖాతా
అరె కింగాదికింగులంత ఢంగయ్యే పెళ్ళి చేస్త

రాజాధిరాజానూ నేనురా ఇక వైజాగూ వైభోగం చూడరా
సరదాల సామ్రాట్టు నేనురోయ్ ఇక సర్కారూ సీడెడ్డు నావిరా
జాక్ పాటే నేను కొట్టెస్తా జయహూరే నేను పట్టేస్తా
టాటాతో మాట కలిపేస్తా బిర్లా కే బీటు వేసేస్తా
రాజాధిరాజానూ నేనురా ఇక వైజాగూ వైభోగం చూడరా
సరదాల సామ్రాట్టు నేనురా ఇక సర్కారూ సీడెడ్డు నావిరా

జాతిసొత్తూ ఈ స్టీలు ప్లాంటూ రాసి ఇస్తా రారందిరోయ్
కప్పలల్లే మూగేటి నీకూ షిప్పు యార్డే ఇస్తానురోయ్
రత్నాల రాశిలెన్నో రాయల్లా రాసి ఇస్తా
రంభంటి ఊర్వశొస్తే రాయల్లా లవ్వు చేస్తా
గంటకొక్క కోటి మా అమ్మ రామకోటి
లక్ష్మిదేవితోనె నాకుంది లావాదేవీ
అరె ఎంపరర్ల కొండల్లో ఎవరెస్టు లాంటి వాణ్ణి

రాజాధిరాజానూ నేనురా ఇక వైజాగూ వైభోగం చూడరా
సరదాల సామ్రాట్టు నేనురా ఇక సర్కారూ సీడెడ్డు నావిరా
జాక్ పాటే నేను కొట్టెస్తా జయహూరే నేను పట్టేస్తా
టాటాతో మాట కలిపేస్తా బిర్లా కే బీటు వేసేస్తా
రాజాధిరాజానూ నేనురా ఇక వైజాగూ వైభోగం చూడరా
సరదాల సామ్రాట్టు నేనురా ఇక సర్కారూ సీడెడ్డు నావిరా

Music Director Wise   Film Wise


How to use

In Junolyrics, This box contains the lyrics of Songs .If you like the lyrics, Please leave your comments and share here . Easily you can get the lyrics of the same movie. click here to find out more Lyrics.